ఉత్సాహ ఉద్వేగ ఉష్ణోగ్ర జ్వాలా!
ఉత్సాహ ఉద్వేగ ఉష్ణోగ్ర జ్వాలా ఉత్తేజితం నీ సమరహేలా
ఉత్సాహ ఉద్వేగ ఉష్ణోగ్ర జ్వాలా
ఉత్తేజితం నీ సమరహేలా
దిగంతాల మోగుతోంది నీ విజయ గాథా
స్వరాష్ర్టాన్ని సాధించిన వీరయోధా
జనగణ మన గానం జై తెలంగాణ ధ్వానం
మిన్నంటిన గళం నీదయా!
పిడికిలెత్తినాము మేం పిడుగులమైనాము
నీ పిలుపు వింటే చాలయా!
గుండెలో తెలంగాణ గొంతులో రుద్రవీణ
సాహసం నీ పథం
ఈనేల క్రాంతి నీవే క్షాంతి నీవె శాంతి నీవయా…
॥ ఉత్సాహ ఉద్వేగ ॥
బాపూజీ భావము- అంబేద్కరు ధ్యేయమూ, మానవత్వమే నీ మతం. సహజీవన ధర్మమూ సమానతే సూత్రమూ, రాజ్యాంగమే ప్రమాణమూ..
ఆలయాల గోపురాల మసీదు మినారులా – ఆ చర్చి శిఖరం పైనా
ఎగురుతున్న పావురాల సమజీవన శృతిలోనా
సమైక్యతా రాగం లోనా
వేదమైన, ఖురానైన, బైబిలైన, గీతయైన
సకలతత్వ సారం ఒకటే…
పాడుతాం జాతిగీతం- నీ ప్రేరణే సుప్రభాతం
నీ అడుగులో అడుగులేస్తూ
ఈ దేశ జనత కొరకు సమతకోరి కదులుతామయా
॥ ఉత్సాహ ఉద్వేగ ॥
ఆరాధనలేవైనా ఆత్మజ్యోతి ఒక్కటన్న
వివేకానంద భాష్యమూ
పరివర్తన నిత్యమన్న అహింసయే ధర్మమన్న
బౌద్ధ తత్వ విశాలత్వమూ
పరమహంస యోగుల- ప్రవచనాల దారులా
సహనశీల సారథులౌతాం
పరమహింస వాదుల కుతంత్రాలు కూల్చగా
లౌకికతా వారధులౌతాం
షిరిడీ సాయిబోధ కబీరు జ్ఞానగీత-థెరీసా
మానవీయతా
ఠాగూరు గీతాంజలి-కాళోజీ కవనలహరి గాలిబ్ కవి షాయరీ ఝరీ
గంగ యమున కావేరి బ్రహ్మపుత్ర గోదావరి
అలల కలల పాత ఒక్కటే
భారతీయతే మనకు ప్రాణం అది
కేసీఆర్ హృదయనాదం
నీ ఆశకే శ్వాసలౌతాం.. నీవెంట నిలుస్తాము,
నడుస్తాము గెలుస్తామయా
॥ ఉత్సాహ ఉద్వేగ ఉష్ణోగ్ర జ్వాలా॥
రచన: డి.అభిజ్ఞ
(సీఎం కేసీఆర్ ముంబై పర్యటన సందర్భంగా..)
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

