మేదరి రాయమల్లు తెచ్చిచ్చిన చాట
అవ్వ చేతిలో నానబెట్టిన పేపర్లు, మెంతులు
రుబ్బిన పేస్టును ఫేయర్ అండ్ లవ్లీలా
పూసుకొని ముస్తాబైంది!
అమ్మ చేతిలో బియ్యంలో రాళ్లు రప్పలూ..
మెరిగలను వేరు చేస్తూ…
పూనకం వచ్చిన గౌండ్ల కిష్టమ్మలా
పున్నమి నాటి సముద్రంలా ఎగిరెగిరిపడింది
నేను, వేణుగాడు, రమణ గాడు
చాటని నిలవెట్టి.. ఆసరగా దాంట్లో కట్టె బెట్టి
బియ్యపు గింజలు పోసి మొల్కమండే మీదున్న ఊరవిశ్కలు
పట్టాలనీ బాయిపక్కన చాటుమాటుగా నిల్చుండ
అవి చాటదగ్గరికి రాగానే ఉరికే
ఆసరాగా ఉన్న కట్టెను అమాంతం లాగితే ఒక్కటన్నా
చాట కింద పడ్తదేమొనని తండ్లాట పడేటోళ్లం
అగులుబుగులవుతూ నాకు వణుకుడు జ్వరం మోపై..
అల్లుపడుతూ అవ్వ చేతిలోని చాట
శివతాండవం చేసేది
చాట.. బియ్యాన్ని సృష్టించే ఒక ఊటబాయి
చాట.. తిండిగింజల్లోని రాళ్లు ్లరప్పల్ని
వేరుచేసే చేటతెల్లని ఒక రాజహంస
ఎవుసం భూమిలో
పండిన వడ్లని తూర్పార పట్టే రైతన్న
వడ్లకుప్ప ముందు తిరగేసే
రైతు చేతిలో ఖడ్గమయ్యేది
కె.వి.నరేందర్, 94404 02871