Chandramukhi 2 | కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవా లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ చంద్రముఖి 2 (Chandramukhi 2). పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ను రేపు ఉదయం 10 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్ ఇస్తూ రాఘవాలారెన్స్ లుక్ షేర్ చేయగా.. చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపిస్తున్నాడు.
ఇప్పటికే రాఘవా లారెన్స్ చంద్రముఖి భవంతి ద్వారంలోకి వెళ్లి.. తలుపులో నుంచి లోపలికి చూస్తున్న లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. చంద్రముఖి 2 తలుపులు గణేశ్ చతుర్థికి తెరుచుకోనున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సుబాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చంద్రముఖి 2లో లెజెండరీ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.
చంద్రముఖి 2 రాఘవా లారెన్స్ లుక్..
#Chandramukhi2 #Vettaiyan first look tomorrow at 10 am. pic.twitter.com/cFpNv9bmku
— Manobala Vijayabalan (@ManobalaV) July 30, 2023
చంద్రముఖి 2 నయా లుక్..
The doors to the much awaited sequel Chandramukhi 2 🗝️ will be open from Ganesh Chathurthi! 🤗✨
Releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada!#Chandramukhi2 🗝️
🎬 #PVasu
🌟 @offl_Lawrence @KanganaTeam
🎶 @mmkeeravaani
🎥 @RDRajasekar
🛠️ #ThottaTharani
✂️🎞️… pic.twitter.com/nll217OWT2— Ramesh Bala (@rameshlaus) June 29, 2023