అమరావతి : విశాఖలోని రుషికొండ ( Rushikonda) లో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. రుషికొండ భవనాలను చూసి చంద్రబాబు (Chandra Babu) ఆశ్చర్య పడుతున్నారని, అమరావతిలో అలాంటి భవనాన్ని కట్టలేని చంద్రబాబు సిగ్గుపడాలని ఆరోపించారు. కట్టిన వాటిని కూల్చివేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.
రోడ్లను నిర్మించాలంటే గుంతలను పూడుస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వానికి శరవేగంగా వ్యతిరేకత పెరుగుతుందని, ఎన్నికలు ఏ క్షణాన వచ్చిన వైసీపీ విజయం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్నారు. రెడ్‌బుక్‌కు ఎవరూ కూడా భయపడరని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు జిల్లాలో కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.