హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘చలో లోక్ భవన్’ను పోలీసులు భగ్నం చేశారు. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ లోక్‌భవన్ వైపు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, దాడులు ప్రజాస్వామ్య హకులపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.