కరోనా పేషెంట్లకు శుభవార్త.. రెమ్‌డెసివిర్ ధరలో 50 శాతం తగ్గింపు
కరోనా కొత్త కేసుల నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. రెమ్‌డెసివిర్ మందు ధరను 50 శాతానికి తగ్గించారు

న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసుల నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. రెమ్‌డెసివిర్ మందు ధరను 50 శాతానికి తగ్గించారు. కరోనా వైరస్ చికిత్సలో రెమ్‌డెసివిర్‌ను ప్రధాన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ధర రూ.2,450 గా ఉండగా.. తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ.1,225 కే లభించనున్నది.
రెమెడెసివిర్ ఇంజెక్షన్ ధర తగ్గింపు గురించి సమాచారం ఇస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌కు గురైన లక్షలాది మంది రోగులకు భారీ ఉపశమనం ఇస్తుండగా.. ప్రాణాలను రక్షించే రెమెడెసివిర్ ఇంజెక్షన్ ధరలను కేంద్ర ప్రభుత్వం 50 శాతం తగ్గించిందని, కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో ఇది కరోనా రోగులకు శుభవార్తే అన్నారు. భారతదేశంలో రోజువారీ కొత్త కేసులు నిరంతరం పెరుగుతున్నందున ఈ సమయంలో ఈ ఇంజెక్షన్ ధర తగ్గింపు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నదని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ ప్రకారం, కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ రెమ్‌డాక్ ఇంజెక్షన్ ధరను రూ.2,800 నుంచి రూ.899 కు తగ్గించింది. సినర్జీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న రెమ్‌విన్ ధరను రూ.3,950 నుంచి రూ.2,450 కు తగ్గింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న ఇంజెక్షన్ ధరను రూ.5,400 నుంచి రూ.2,700 కు తగ్గించింది.
మొత్తం ఏడు ఫార్మా కంపెనీలను ప్రస్తావిస్తూ ఆరోగ్య మంత్రి సిప్లా లిమిటెడ్ సిప్రెమి ఇంజెక్షన్ ధరను రూ.4,000 నుంచి రూ.3,000 కు తగ్గించారని రాశారు. మైలాన్ ఫార్మాస్యూటికల్ ఎల్పీ ప్రైవేట్ లిమిటెడ్ డెస్రెం ఇంజెక్షన్ ధరను రూ.4,800 నుంచి రూ.3,400 కు తగ్గింది. జూబిలెంట్ జెనరిక్ లిమిటెడ్ జుబీ-ఆర్ ఇంజెక్షన్ ధరను రూ.4,700 నుంచి రూ.3,400 కు తగ్గింది. హెటెరో హెల్త్‌కేర్ లిమిటెడ్ కోవిఫోర్ ఇంజెక్షన్ ధరను రూ.5,400 నుంచి రూ.3,490 కు తగ్గింది.
ఇవి కూడా చదవండి..
మయన్మార్ జుంటా క్షమాభిక్ష.. 23 వేల మంది ఖైదీల విడుదల
గ్రహాంతరవాసులతో పరిచయానికి దగ్గరికొస్తున్న మానవుడు..!?
జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముకు కరోనా
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
స్పేస్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్ రూబిన్స్
నేపాల్‌లో వైభవంగా విషాల్ సింధూర్ జాతర
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్‌కు ఎంపీల వినతి
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

