75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
కనీస వయస్సులో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వివాహం, ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం యువతీయువకుల కనీస వయస్సును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నది.

న్యూఢిల్లీ : కనీస వయస్సులో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వివాహం, ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం యువతీయువకుల కనీస వయస్సును కేంద్ర ప్రభుత్వం మార్చనున్నది. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికల్లా ఈ నిర్వచనానికి కొత్త రూపం ఇచ్చి ప్రకటించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తున్నది. సమీప భవిష్యత్‌లో కనీస చట్టపరమైన వయస్సుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ నిబంధనల్లో ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిల వివాహ వయస్సు ఒకేలా ఉండనున్నది. సిగరెట్-పొగాకు వాడకంతోపాటు మద్యం సేవించడానికి కనీస వయస్సు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నది.
వివాహానికి సంబంధించి అమ్మాయిలు, అబ్బాయిల కనీస వయస్సుపై టాస్క్‌ఫోర్స్ నివేదికపై నీతి ఆయోగ్ ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించి చర్చించింది. సాధ్యమైన వివాహం కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ఉండనున్నది. ఈ విషయాన్ని రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కనీస వయస్సులో మార్పును పరిశీలిస్తామని గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు.
పార్లమెంటరీ కమిటీ నివేదిక సిద్ధం
డాటా రక్షణ బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదిక ఖరారవుతున్నది. దీనిలో ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం పిల్లల కనీస వయసును నిర్ణయించనున్నారు. యుఎస్, ఐరోపాలోని చాలా దేశాలలో 13 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు పిల్లలను పెద్దలుగా పరిగణించి ఇంటర్నెట్ సర్ఫింగ్‌కు అనుమతిస్తున్నారు. భారతదేశంలోని సోషల్ మీడియా సంస్థలు పార్లమెంటరీ కమిటీ ముందు ఇదే వాదన చేశాయి. సిగరెట్ స్మోకింగ్, పొగాకు వినియోగం వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ముసాయిదా బిల్లు కూడా సిద్ధంగా ఉంచారు. ఈ బిల్లుతో విమానాశ్రయాలు, రెస్టారెంట్లలో స్మోకింగ్ గదుల వ్యవస్థ రద్దవనున్నది.
మద్యం తాగేందుకు కనీస వయస్సును నిర్ణయించే హక్కు రాష్ట్రాలకు ఉన్నది. కనీస వయస్సు 25 సంవత్సరాలు కావాలని చాలా కాలంగా ఒత్తిడి ఉంది. ఉమ్మడి జాబితాలో మద్యం తీసుకురావడం అవసరం అనే డిమాండ్ కూడా ఉన్నందున దీనిపై కూడా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

