ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కెయిరౌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఓటర్లకు పోలింగ్ కేంద్రంలోనే డబ్బులు పంపిణీ చేశాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ఎన్నికల ఉన్నతాధికారులకు ఈ దృశ్యం చిక్కింది. దీంతో సంబంధిత పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసు ఇంచార్జిని అప్రమత్తం చేశారు. డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
తొలి దశలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 5వ తేదీన తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.