ఎమర్జెన్సీ లైట్బ్యాటరీలో తరలించే యత్నం
శంషాబాద్, అక్టోబర్ 19: ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీల్లో దాచి తరలిస్తున్న ఆరు కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను సైతం అరెస్టుచేశారు. అధికారుల వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈకే 524 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేశారు. వారి సూట్‌కేసులో ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో స్మగ్లింగ్ బంగారం గుర్తుపట్టకుండా దాచి ఉంచారు. బంగారం పరిమాణం ఆరు కిలోలు ఉన్నది. దాని విలువ రూ.2.97 కోట్లు. బంగారం స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.