హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలతోపాటు ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రె స్ అభ్యర్థి నవీన్‌యాదవ్, ఆయన సోదరుడు వెంకట్‌యాదవ్‌పై బోరబండ పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్, బాబాయ్ రమేశ్‌యాదవ్ ఇప్పటికే బోరబండలో రౌడీషీటర్లుగా నమోదై ఉన్నారు. తాజా గా నవీన్‌యాదవ్ బ్రదర్స్‌పై కూడా కేసులు నమోదువ్వడం హాట్ టాపిక్‌గా మారింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తానంటూ గత నెల 29న నవీన్‌యాదవ్ మీడియా ముఖంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుం డా, ‘బీఆర్ఎస్ వాళ్లు పిచ్చిపిచ్చి వేషాలు, పిచ్చిపిచ్చి తమాషాలు వేయకండి.. జూబ్లీహి ల్స్ నా ఇల్లు.. నా ప్రాంతం.. ఎక్కడినుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే మీరు కాదు కదా.. మీ బాసులు కూడా గల్లీదాటరు.. మీ ఇల్లు చూడర’ంటూ నవీన్‌యాదవ్ హెచ్చరికలు జారీ చేశారని, ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్వో షేక్ అజహరుద్దీన్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల మేరకు నవీన్‌యాదవ్‌పై బోరబం డ పోలీసులు 351(2), 351(3)సెక్షన్ల కింద వేర్వేరుగా రెండు కేసులు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో మూడవ అడిషనల్ జ్యూడిషియ ల్ మెజిస్ట్రేట్ (హైదరాబాద్) ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నవీన్ సోదరుడు వెంకట్‌యాదవ్‌పై కేసు
ఎర్రగడ్డలో నవీన్‌యాదవ్ సోదరుడు వెంకట్‌యాదవ్ ఎర్రగడ్డ వికాసపురిలో అక్టోబర్ 30న తనను బెదిరించారంటూ బీఆర్ఎస్ కార్యకర్త వై తరుణ్‌యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వెంకట్యాదవ్తోపాటు 15 మంది వ్యక్తులు బీఆర్ఎస్ శ్రేణుల ను చుట్టుముట్టి బూత్ పేపర్లు లాక్కొని దుర్భాషలాడుతూ మళ్లీ ఈ ఏరియాలో కనిపిస్తే చంపేస్తానని బెదిరించారని తరుణ్‌యాదవ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో భయాన్ని సృష్టించిన వెంకట్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో బోరబండ పోలీసులు వెంకట్‌యాదవ్‌పై 351(2), 351(3), 352 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.