Andrey Rublev | మ్యాడ్రిడ్: యువ సంచలనం కార్లొస్ అల్కరజ్ (స్పెయిన్)కు మ్యాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అల్కరజ్‌కు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో 6-4, 3-6, 2-6 తేడాతో ఏడో సీడ్ రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ షాకిచ్చాడు.
తొలి సెట్లో ఓడినా రుబ్లెవ్ తర్వాత పుంజుకుని అల్కరజ్ను నిలువరించాడు. సెమీస్‌లో రుబ్లెవ్.. అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంక, రిబాకినా క్వార్టర్స్ నెగ్గి సెమీస్‌లో ఢీకొననున్నారు. మరో సెమీస్‌లో ఇగా స్వియాటెక్ మాడిసన్ కీస్‌ను ఓడించి ఫైనల్ చేరింది.