నామ్పెన్: ల్యాండ్మైన్లను పసిగట్టే ఎలుక ‘మగావా’ మరణించింది. ఎనిమిది ఏండ్ల వయసున్న మగావా గత వారం ఆఖరులో మరణించిందని బెల్జియంకి చెందిన అంతర్జాతీయ చారిటీ ఏపీఓపీఓ తాజాగా వెల్లడించింది. మగావా తన ఐదేండ్ల కెరీర్లో ఆగ్నేయాసియా దేశమైన కాంబోడియాలో 100కు పైగా మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను పసిగట్టింది. తన సేవల ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడిన ఈ ఎలుకను ‘హీరో ర్యాట్’గా పిలుస్తారు. దశాబ్దాల అంతర్యుద్ధం లో కాంబోడియాలో ల్యాండ్మైన్ల పేలుడు కారణంగా వేలాది మంది అవయవాలు కోల్పోయారు.