
తూప్రాన్/రామాయంపేట 10: తూప్రాన్ పట్టణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం తూప్రాన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో వంద శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 63 ఓట్లకు గాను 27 మంది పురుషులు, 36 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూప్రాన్ పోలింగ్ కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూప్రా న్, మనోహరాబాద్ మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కొవిడ్ నిబంధనలతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో డీఎస్పీ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో తూప్రాన్ సీఐ.స్వామిగౌడ్, మనోహరాబాద్, వెల్దుర్తి, తూప్రాన్ ఎస్సైలు రాజుగౌడ్, సురేశ్ కుమార్, మహేందర్, యాదగిరిరెడ్డి బందోబస్తు చేపట్టారు. తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఎంపీడీవో అరుంధతి, మున్సిపల్ కమిషనర్ మోహన్ పటిష్ట చర్యలను చేపట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్దే:జడ్పీ చైర్పర్సన్ హేమలత
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డిదే విజయమని జడ్పీ చైర్పర్సన్ హేమలత ,తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, ఎంపీపీలు స్వప్న, నవనీత, స్వరూప, జడ్పీటీసీలు రాణి, రమేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ సుజాత అన్నారు.
పోలింగ్ ప్రశాంతం : అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. తూప్రాన్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
నర్సాపూర్‌లో..
నర్సాపూర్, డిసెంబర్ 10: మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం ఓటింగ్ మందకొడిగా సాగిన 11 గంటల అనంతరం వేగంగా కొనసాగింది. నర్సాపూర్‌లో మొత్తం 68 మంది ఓటర్లకు గాను 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదనపు కలెక్టర్ రమేశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పోలింగ్ కేం ద్రాన్ని సందర్శించి సరళిని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఐ లింగేశ్వర్ రావు ఆధ్వర్యంలో 25 మంది పోలీస్ సిబ్బ ందితో బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రక్రియను నిలిపివేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్ లను తరలించారు.
చేగుంటలో..
చేగుంట,డిసెంబర్10: తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట, నార్సింగి మండల ఎమ్మెల్సీ ఓటింగ్ ఇన్చార్జి నగేశ్ ఆధ్వర్యంలో ఓటు హ క్కును వినియోగించుకున్నారు.కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, సబిత, జడ్పీటీసీలు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, ఎం పీటీసీలు వెంకట్ లక్ష్మి, గాండ్ల లత, బక్కి లక్ష్మి, బండి కవి త, శోభ, శ్రీనివాస్, నవీన్, హోలియానాయక్, గణేశ్, సు జాత, సత్యనారాయణ, చేగుంట సొసైటీ డైరెక్టర్ రఘు రా ములు, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, బండి విశ్వేశ్వర్, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్ తదితరులున్నారు.