మహబూబ్నగర్ : కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అలంపూర్ చౌరస్తా సమీపంలో డివైడర్ ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. కాచిగూడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు.. ప్రయాణికులతో ఏపీలోని కర్నూలు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఉండవల్లి మండలం కంచుపాడు సమీపంలో డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉండగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.