IND vs NZ : గువాహటిలో భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు బ్రేకులు వేశారు. భారీ స్కోర్‌తో సిరీస్ కాపాడుకోవాలనుకున్న వారి ప్రయత్నాలకు గండికొడుతూ.. వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు. జస్ప్రీత్ బుమ్రా(3-17) విజృంభణకు రవి బిష్ణోయ్(2-18)స్పిన్ మ్యాజిక్ తోడవ్వగా.. కివీస్ హిట్టర్లు తడబడ్డారు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన జట్టును గ్లెన్ ఫిలిప్స్(48), మార్చ్ చాప్మన్(32), కెప్టెన్ మిచెల్ శాంట్నర్(27) ఆదుకున్నారు. వీరి మెరుపులతో కోలుకున్న బ్లాక్‌క్యాప్స్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
టాస్ ఓడిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే(1)వికెట్ కోల్పోయింది. మిడాన్‌లో కాన్వే ఆడిన బంతిని పైకి ఎగురుతూ హార్దిక్ పాండ్యా చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాతి.. ఓవర్లోనే రచిన్ రవీంద్ర(4)ను హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. బుమ్రా డేంజరస్ టిమ్ సీఫర్ట్(12)ను తొలి బంతికే బౌల్డ్ చేశాడు. 32కే మూడు వికెట్లు పడిన వేళ.. గ్లెన్ ఫిలిప్స్ (48), మార్క్ 32దూకుడుగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. కుల్దీప్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకొని చాప్మన్ సిక్స్, ఫోర్ బాదగా.. ఫిలిప్స్ సిక్సర్ సంధించాడు. ఆ తర్వాతి ఓవర్లో దూబే.. పది రన్స్ పిండుకున్నారు. నాలుగో వికెట్‌కు యాభై రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని రవి బిష్ణోయ్(2-18) విడదీశాడు.
Two wickets in quick succession!
Hardik Pandya 🤝 Ravi Bishnoi
New Zealand 112/6
Updates ▶️ https://t.co/YzRfqi0li2#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/MMn7qcct37
— BCCI (@BCCI) January 25, 2026
చాప్మన్ తర్వాత డారిల్ మిచెల్(14)ను పెద్ద షాట్లు ఆడే అవకాశమివ్వకుండానే పక్కా ఫీల్డింగ్ మార్పుతో పాండ్యా వెనక్కి పంపాడు. అర్ధ శతకానికి చేరువైన ఫిలిప్స్‌ను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చగా.. జేమీసన్(3)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ మిచెల్ శాంట్నర్(27) మాత్రం బౌండరీలతో అలరించాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. గువాహటిలో గత నాలుగు మ్యాచుల్లో రెండొందలకు పైగా స్కోర్లు నమోదుకాగా.. భారత బౌలర్లు మాత్రం కివీస్‌ను అద్భుతంగా కట్టడి చేశారు.
Innings Break!
Terrific bowling effort by #TeamIndia in Guwahati 👏
Chase coming up shortly⌛
Scorecard ▶️ https://t.co/YzRfqi0li2#INDvNZ | @IDFCFIRSTBank ️ pic.twitter.com/iBxD7a7W0D
— BCCI (@BCCI) January 25, 2026