Vasundhara Raje | రాజకీయాల్లో రాణించాలంటే మహిళలు మూడు రెట్లు కష్టపడాలి: మాజీ సీఎం వసుంధరా రాజే
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం పెరిగినప్పటికీ.. ఇది సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
‘‘రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో మహిళల అక్షరాస్యతా శాతం 9. ఇప్పుడు 65 శాతం ఉంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల శాతం 10. కానీ, 1957లో 3 శాతమే ఉండేది. తొలి లోక్‌సభలో పార్లమెంట్లో మహిళల సంఖ్య 22. ఇప్పుడు 74. రాజ్యసభలో 1952లో 15 మంది మహిళలు ఉండేవారు. ఇప్పుడు 42 మంది ఉన్నారు. ఈ సంఖ్య పెరిగింది. కానీ, ఇది సరిపోదు. పురుషులతో సమానంగా మహిళలు చట్టసభల్లో ఉండాలి. హేమా మాలిని, డా.కమలా బెనివాల్, సుమిత్రా సింగ్, డా.ప్రియాంకా చౌదరి, రీతా చౌదరి వంటి ఎందరో మహిళలు రాజకీయాల్లో రాణించారు’’ అని వసుంధరా రాజే వ్యాఖ్యానించారు.
ఆమె బీజేపీ తరఫున ఎన్నికై.. 2003-2008 వరకు, 2013-2018 వరకు రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా పని చేశారు. 2023లో ఆమె బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ, బీజేపీ అధిష్టానం భజన్ లాల్ శర్మను సీఎంగా నియమించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

