బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అభిమానులకు షాకిచ్చాడు. తాను సోషల్‌మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు కొద్ది సేపటి క్రితమే అమీర్‌ఖాన్ ట్వీట్ పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. తనకు పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు..సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు అమీర్‌ఖాన్. ఇక నుంచి ఈ స్టార్ హీరోకు సంబంధించిన అప్డేట్స్ ను స్వీయ నిర్మాణ సంస్థ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏకేపీ) అందించనుంది.
నాపై ప్రేమాభిమానాలను చూపించిన అందరికి ధన్యవాదాలు. మరో వార్త ఏంటంటే..సోషల్ మీడియాలో ఇదే నా ఆఖరి పోస్ట్. నేను ఏ మార్గంలోనైనా చురుకుగా ఉంటానని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకుముందులాగే నేను మీతో కమ్యూనికేట్ అవుతూనే ఉంటానంటూ ట్వీట్ సందేశంలో పేర్కొన్నాడు. (ఏకేపీ) అధికారిక ఛానల్‌ను ప్రారంభించింది. నాకు, నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను మీరక్కడ చూడొచ్చు. అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ @akppl_official..ఇదేనంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు అమీర్‌ఖాన్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.