KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నిరుపేద విద్యార్థి మహేష్‌కు ల్యాప్టాప్అందజేశారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR ) చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ (Gift a Smile ) కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నిరుపేద విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ ( Laptop ) అందజేశారు. విద్యార్థి మహేష్ ( Mahesh Engineering ) ఇంజినీరింగ్ పూర్తి చేసి, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా అనలిటిక్స్ కోర్సు కోసం సిద్ధమవుతున్నాడు. మహేష్ చదువుకు ల్యాప్‌టాప్ అవసరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన చేతుల మీదుగా విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థి మహేష్‌ను అభినందించారు. ఉన్నత విద్యలో మరింత రాణించాలని, ఎంచుకున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ, వారి కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించడమే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం లక్ష్యమని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- laptop
- POOR STUDENT
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

