KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు బీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. రాఖీ పండుగను పునస్కరించుకొని శుక్రవారం ఎర్రవల్లిలోని నివాసంలో గులాబీ అధినేతకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమలు రాఖీలు కట్టారు. అనంతరం వారికి కానుకలు అందజేశారు కేసీఆర్. ఆపై ఉమ, సునీతలు ఆయన దీవెనలు తీసుకున్నారు. కేసీఆర్ శోభ దంపతులు ఉమ, సునీతను ఆశీర్వదించారు.
రాఖీ పండుగ సందర్భంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ మహిళా నేతలు తరలివెళ్లారు. తమ అభిమాన నాయకుడు, పార్టీ అధినేత.. పెద్దన్నలాంటి కేసీఆర్కు తుల ఉమ, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి కానుకలు అందించిన కేసీఆర్ దంపతులు.. ఇద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
కేసీఆర్కు రాఖీ కట్టిన బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు గొంగిడి సునీత, తుల ఉమ pic.twitter.com/UAqKkDZR0M
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026