Raksha Bandhan | కోహ్లీకి రాఖీ కట్టిన సోదరి.. ‘నా ప్రార్థనలు ఎల్లప్పుడు మిమ్మల్ని కనుగొంటాయ’ని పోస్ట్..!
Raksha Bandhan : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రాఖీ పండుగను సంబురంగా చేసుకున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా తోబుట్టువు భావన(Bhawna) అతడికి రాఖీ కట్టి మురిసిపోయింది.
Raksha Bandhan : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రాఖీ పండుగను సంబురంగా చేసుకున్నాడు. రక్షా బంధన్ సందర్భంగా తోబుట్టువు భావన(Bhawna) అతడికి రాఖీ కట్టి మురిసిపోయింది. సోదరుడికి రాఖీ కట్టిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆమె ఆసక్తికర క్యాప్షన్ రాసింది. ‘నా ప్రార్థనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని కనుగొంటాయి’ అంటూ భావన పెట్టిన పోస్ట్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం గొప్పతనానికి అద్దం పడుతోంది.
రక్షా బంధన్ వేళ తోబుట్టువు చేత్తో రాఖీ కట్టించుకున్నారు పలువురు సెలబ్రిటీలు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం సోదరి భావనతో రాఖీ కట్టించుకున్నాడు. విరాట్ అన్నయ్య వికాస్‌కు సైతం ఆమె రాఖీ కట్టింది. అనంతరం సోదరులతో తన అనుబంధం.. రాఖీ విశిష్టతను ప్రతిబించేలా సోషల్‌మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది భావన.
🚨🚨BHAWNA ASKS VIRAT KOHLI FOR 100 CENTURIES AS A GIFT ON RAKSHA BANDHAN
Virat Kohli’s sister Bhawna tied a Rakhi on her brother Virat Kohli’s wrist, and in return, she asked him for 100 centuries as a gift. According to sources close to Virat Kohli, Bhawna made this special… pic.twitter.com/IwH7mnzB6K
— Oxygen (@Oxygen18_) August 28, 2026
‘జీవితం మనల్ని ఎంత దూరం తీసుకెళ్లినా.. నా ప్రార్థనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని కనుగొంటాయి’ అంటూ ఆమె కోహ్లీ, వికాస్‌లకు రాఖీ కట్టిన ఫొటోలను పంచుకుంది. ఆమె క్యాప్షన్ చదివినవాళ్లంతా ‘అవును.. మన సోదరులు ఎక్కడున్నా రక్షా బంధన్ మనల్ని ఒక్కటి చేస్తుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
లండన్‌ను తన రెండో ఇంటిగా మార్చుకున్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మ, పిల్లలతో పాటు భారత్‌కు వచ్చి రాఖీ కట్టించుకున్నాడని నెట్టింట పోస్ట్‌లు వైరలవుతున్నాయి. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌లో మెరిసిన విరాట్.. సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న విషయం తెలిసిందే.
Kohli came, celebrated Rakhi & left ❤️#viratkohli pic.twitter.com/Mo1Fqju5lU
— Surya Vanshi II (@Surya_Vanshi_II) August 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

