 
                                                            జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ముమ్మరం చేస్తోంది. ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం ఎంత అవసరమో వివరిస్తోంది. పార్టీ డివిజన్ ఇన్చార్జిలు, సీనియర్ నాయకుల నేతృత్వంలో అన్ని డివిజన్లు, బూత్‌లలో ప్రచార బృందాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా టీమ్ కూడా బీఆర్ఎస్ పార్టీని మార్గదర్శిగా తీసుకుంది. అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు సౌతాఫ్రికా టీమ్ షేక్‌పేట్ ప్రాంతంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తోంది. అందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని తెలిపింది. బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిపించాలని ఆ టీమ్ జనానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఎన్నికల్లో నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పు తెలంగాణలో నాలుగుకోట్ల మంది భవిష్యత్‌ను నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రజలకు కుప్లంగా వివరిస్తోంది.
ఈ ప్రచారంలో నరేందర్ రెడ్డి మేడసాని, జైవిష్ణు గుండా, నరేష్ తేజ యాదారి, శ్రీనివాస్ రేపల పాల్గొన్నారు. అదేవిధంగా సౌతాఫ్రికా టీమ్ నాయకులు, కార్యకర్తలు.. హోటళ్లు, కిరాణా షాపులు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, పార్కులు వంటి జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని పార్టీ అభ్యర్థి సునీతకు మద్దతు తెలిపారు.
 
                            