హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు స్టాప్‌వాచ్ కాదు.. దూరదృష్టి కలిగిన నాయకత్వం కావాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఉద్యోగులను అదనంగా పనిచేయాలని కోరడం ముఖ్యమంత్రి పాలనా వైఫల్యానికి నిదర్శమని మండిపడ్డారు.
సమర్థవంతమైన పాలన అనేది ఉద్యోగుల పనిగంటలు పెంచడంలో కాదు.. సరైన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనాలోచిత విధానాలు, రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్నదని చెప్పారు.