నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి
అత్యల్ప వర్షపాతం నమోదైన నల్లబెల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అత్యల్ప వర్షపాతం నమోదైన నల్లబెల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరువు మండలాల జాబితాలో నల్లబెల్లిని చేర్చకపోవడంపై వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం క్రాస్‌రోడ్డు వద్ద నేషనల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
అత్యంత కరువు కోరల్లో చిక్కున్న నల్లబెల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. నల్లబెల్లి మండలంలో నెలకొన్న కరువుపై ఎమ్మెల్యే దొంతి వైఖరి ఏందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
– నల్లబెల్లి
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అరిగోస
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్ అరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కడ్తాల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
– కడ్తాల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

