కావలసిన పదార్థాలు
బ్రకోలి ముక్కలు: ఒక కప్పు, స్వీట్ కార్న్: అర కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కరివేపాకు, కొత్తిమీర తురుము: కొద్దిగా, కొబ్బరి నూనె: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
బ్రకోలి ముక్కలను రెండు నిమిషాలపాటు వేడినీళ్లలో కొద్దిగా ఉప్పువేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్వీట్‌కార్న్, బ్రకోలి ముక్కలను ఒక గిన్నెలో వేసి ఐదు నిమిషాలపాటు ఆవిరిపై ఉడికించాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి కొబ్బరినూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన బ్రకోలి, స్వీట్‌కార్న్ కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు తురుము వేసి బాగా కలుపుకొంటే బ్రకోలి కార్న్ సలాడ్ సిద్ధం.