Anna Konidela | ఇన్స్టాగ్రామ్లోకి ‘అన్నా కొణిదెల’ గ్రాండ్ ఎంట్రీ.. అభిమానుల నుంచి భారీ స్పందన
Anna Konidela | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి ‘అన్నా కొణిదెల’గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఖాతా ప్రారంభించగానే అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆమె తొలి పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Anna Konidela | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి ‘అన్నా కొణిదెల’గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఖాతా ప్రారంభించగానే అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆమె తొలి పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మొదటి పోస్ట్ సాధారణ పరిచయంకి సంబంధించింది కాగా , రెండో పోస్టులో భర్త పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. తన బయోలో ‘ రష్మన్ హార్ట్ , ఇండియన్ సోల్ అని పేర్కొనడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని అందంగా వ్యక్తపరిచారు అన్నా లెజినోవా.
రష్యాలో జన్మించిన ఆమె, భారతీయ కుటుంబంలోకి కోడలిగా చేరిన తర్వాత రెండు సంస్కృతుల సమ్మేళనంగా జీవిస్తున్నానని తెలియజేసింది. అలాగే ప్రేమ, కృతజ్ఞతలతో జీవిస్తూ నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని కూడా తన ప్రొఫైల్లో తెలియజేశారు. ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ సందర్భంగా షేర్ చేసిన పోస్టులో, చాలా కాలంగా సోషల్ మీడియాలోకి రావాలని అనుకున్నానని, ఇప్పుడు సరైన సమయం అనిపించిందని తెలిపారు. చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆమె ఖాతా ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఫాలోవర్స్ సంఖ్య లక్ష దాటడం విశేషం.
అన్నా కొణిదెల ఇన్స్టాలోకి ఎంట్రీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ తన భార్యకు స్వాగతం పలుకుతూ ఒక పోస్ట్ చేశాడు. ‘డియర్ అన్నా కొణిదెల, ఇన్స్టాగ్రామ్లోకి నీకు సాదర స్వాగతం.. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ అభిమానులతో ఎక్కువగా మమేకం కావడం అరుదు. ఈ నేపథ్యంలో అన్నా కొణిదెల ఎంట్రీతో ఆమె మెగా అభిమానులకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటారని, ఫాలోవర్స్ సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

