బ్రకోలి ముక్కలు: ఒక కప్పు, క్యాప్సికమ్ ముక్కలు: ఒక కప్పు (పెద్దగా తరిగినవి), ఉల్లిగడ్డ ముక్కలు: ఒక కప్పు, పార్సిమన్ చీజ్: పావు కప్పు, చీజ్ ముక్కలు: ఒక కప్పు, ఆరిగానో, రోస్‌మేరీ: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత.
బ్రకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడి నీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి. టూత్‌పిక్‌లకు బ్రకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి. ఓవెన్‌ను 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి. బ్రకోలి స్టిక్స్‌ను పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి, పైనుంచి తురిమిన పార్సిమన్ చీజ్, ఆరిగానో, రోస్‌మేరీ, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే వేడివేడి బ్రకోలి చీజ్ స్టిక్స్ సిద్ధం.