Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
Viral News | అతను సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళపై మనసు పారేసుకున్నాడు. ఏళ్ల తరబడి ఆమెను ఫాలో అయ్యాడు. అందమైన ఆమె ఫొటోలు చూస్తూ ఆనంద పరవశంలో మునిగితేలాడు. మొగుడు కావాలన్న ఆమె ప్రకటన చూసి ఆగలేకపోయాడు. తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఆమెను కలిసేందుకు దాదాపు 2000 వేల కిలోమీటర్ల దూరం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆమే అమేకాదని తెలుసుకుని అబాసుపాలయ్యాడు.
Viral News : అతను సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళపై మనసు పారేసుకున్నాడు. ఏళ్ల తరబడి ఆమెను ఫాలో అయ్యాడు. అందమైన ఆమె ఫొటోలు చూస్తూ ఆనంద పరవశంలో మునిగితేలాడు. మొగుడు కావాలన్న ఆమె ప్రకటన చూసి ఆగలేకపోయాడు. తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఆమెను కలిసేందుకు దాదాపు 2000 వేల కిలోమీటర్ల దూరం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆమే అమేకాదని తెలుసుకుని అబాసుపాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లోని ఇంపిరాట్రిజ్కు చెందిన 49 ఏళ్ల ఎడిమర్ రోచా మార్టిన్స్ (Edimar Rocha Martins) వృత్తిరీత్యా ఓ తాపీ మేస్త్రీ. తండ్రి చిన్ననాడే దూరమయ్యాడు. పెళ్లి కాలేదు. ఇటీవల తల్లి కూడా మరణించింది. దాంతో మార్టిన్స్ ఒంటరి వాడయ్యాడు. తల్లి మరణం తర్వాత ఒంటరితనంతో బాధపడుతున్న అతనికి.. 2020లో సోషల్ మీడియాలో ‘జెస్సికా ఒలివిరా’ పేరుతో ఉన్న ఓ ప్రొఫైల్ టచ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను నిత్యం ఫాలో అవుతూ వచ్చాడు.
జెస్సికా ప్రొఫైల్‌లోని అందమైన యువతి ఫోటోలు, వీడియోలు మార్టిన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో ఆమె తనను తాను వితంతువుగా పరిచయం చేసుకుని, తనతో నివసించడానికి ఒంటరిగా ఉన్న పురుషులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నది. తనను చేసుకోబోయే వారు పని చేయాల్సిన అవసరం లేదని, ఆర్థికంగా తానే ఆదుకుంటానని ఆమె పోస్టు చేసింది. మార్టిన్స్ ఆమెను పూర్తిగా నమ్మాడు.
ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మార్టిన్స్.. తన సర్వస్వాన్ని అమ్ముకుని ఈ నెల తొలివారంలో బస్సులో సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. దాదాపు 36 గంటలపాటు ప్రయాణించి సుమారు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలొ హారిజొంటె నగరానికి చేరుకున్నాడు. జెస్సికా ఫోటోను పట్టుకుని వీధులన్నీ తిరుగుతూ ఆమె గురించి ఆరా తీశాడు. కానీ ఎవరికీ ఆమె ఎవరో తెలియలేదు. దాంతో అతను మోసపోయానని గ్రహించాడు. అది ఏఐ సృష్టించిన క్యారెక్టర్ అని తెలుసుకుని తీవ్ర నిరాశకు గురయ్యాడు.
కాగా, మార్టిన్స్‌ను ప్రేమలోకి ఖాతాకు మూడు లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ ప్రొఫైల్ క్రియేటర్ మార్టిన్ అంశంపై స్పందిస్తూ.. మార్కెటింగ్, వస్తువుల అమ్మకాల కోసమే ఆ ఏఐ క్యారెక్టర్‌ను సృష్టించామని, తామెప్పుడూ మార్టిన్స్‌తో వ్యక్తిగతంగా చాట్ చేయలేదని, సుదూర ప్రయాణం చేసి రమ్మని కోరలేదని స్పష్టంచేశారు. అయితే ఆ తర్వాత ఆ ఖాతాను సోషల్ మీడియా నుంచి తొలగించారు.
ఉన్నదమ్ముకుని బెలొ హారిజొంటె నగరానికి చేరుకున్న మార్టిన్స్ చేతిలో డబ్బులు అయిపోయాయి. దాంతో అతను స్థానిక సిటీ హాల్‌ను ఆశ్రయించి తిరుగు ప్రయాణం కోసం సామాజిక కార్యకర్తల సాయం కోరాడు. వారి సహకారంతో తిరిగి తన సొంతూరికి చేరుకున్నాడు. ఒక తోడు ఉంటే జీవితం సంతోషంగా ఉంటుందనే ఆశతో ఇంతదూరం వచ్చానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని మార్టిన్స్ ఆవేదన వ్యక్తంచేశాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

