Friendly Match : స్వదేశంలో జరిగిన చారిత్మాత్మక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టు తేలిపోయింది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మేటి జట్టైన బ్రెజిల్ (Brazil) ధాటికి టీమిండియా చేతులెత్తేసింది. ఆరంభంలో మెరుగ్గానే ఆడినా.. ఒక్క గోల్ చేయలేకపోయింది మెన్ ఇన్ బ్లూ. ప్రపంచస్థాయి ఆటగాళ్లతో కూడిన బ్రెజిల్ 4-0తో జయభేరి మోగించింది. దాంతో.. భారత్ గెలవాలని కోరుకున్న అభిమానులు నిరాశ చెందినా, అత్యుత్తమంగా ఆడిన దక్షిణ అమెరికా జట్టు ఆటకు ఫిదా అయ్యారు.
సాకర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ పంజా విసిరింది. స్వదేశంలో బలమైన పనామాతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత జట్టును అలవోకగా ఓడించింది. శనివారం పోరులో తొలి అర్ధ భాగంలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆటగాళ్లు గోల్ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.
FULL TIME | India 0-4 Brazil. 🇮🇳🇧🇷
A spirited performance from the Blue Tigers, but it wasn’t enough against the five-time world champions. Brazil take the win in Kolkata. ⚽#IndianFootball #INDBRA #Brazil pic.twitter.com/E1sGMed0Mp
— Khel Now (@KhelNow) October 3, 2026
కెప్టెన్, గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు పొరపాటు వల్ల 19 ఏళ్ల ఎస్టేవవో 28వ నిమమిషంలో గోల్ కొట్టాడు. 42వ నిమిషంలో అతడు.. పెడ్రోకు బంతిని పాస్ చేయగా రెండో గోల్ ఆ జట్టు చేరింది. రెండో అర్ధ భాగంలో 3-0తో ఆధిక్యంలో ఉన్న బ్రెజిల్.. అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆట ముగుస్తుందనగా ఆఖరి నిమిషంలో సామ్యూల్ లినో మెరుపు గోల్‌ను గుర్ప్రీత్ అడ్డుకోలేకపోయాడు. దాంతో, 4-0తో బ్రెజిల్ విక్టరీ కొట్టింది.
Brazil have beaten India 4-0 in Kolkata! 🇧🇷🙌 pic.twitter.com/Bbb2OhOsfs
— SleeperFootballNews (@SleeperFootNews) October 3, 2026