Boxing Day Test Match | బాక్సింగ్ డే టెస్టులో (AUS vs IND) భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. అయితే రెండో సెషన్లో భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీ బ్రేక్ సమయానికి స్కోర్ తగ్గింది.
ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ (44) తో పాటు స్టీవ్ స్మిత్ (10) ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరొక వికెట్ తీశారు. అంతకుముందు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (57), సామ్ కాన్స్టాస్ (60) హాఫ్ సెంచరీలు సాధించారు. బోర్డర్ గవస్కర్ ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇది నాలుగో మ్యాచ్. గత మూడింట్లో ఇరు జట్లు చెరొక విజయం సాధించగా.. ఒకటి వర్షం కారణంగా డ్రా అయింది. ప్రస్తుతం 1-1తో ఇరు జట్లూ సమంగా నిలిచాయి.