Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
Congress factions clash | కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగింది. అలాగే పూలగుత్తులు, బూట్లు వంటివి విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగింది. అలాగే పూలగుత్తులు, బూట్లు వంటివి విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Congress factions clash) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం లక్నోలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ బాధ్యతలు స్వీకరించారు.
కాగా, యూపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ రాయ్ తన మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జనం గుమిగూడి ఉండటంతో ‘అధ్యక్షులు వస్తున్నారు, దారి ఇవ్వండి’ అని ఆయన మద్దతుదారులు కోరారు. అయితే కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మమతా చౌదరి వర్గం దీనిపై స్పందించింది. ‘ఏ అధ్యక్షుడు?’ అని వారు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తిట్టుకోవడం జరిగాయి. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణగా ఇది మారింది. ఈ నేపథ్యంలో అజయ్ రాయ్ మద్దతుదారులు నినాదాలు చేశారు. చేతుల్లో చెప్పులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ ఘర్షణ సమయంలో తోపులాట, చెప్పులు విసురుకోవడం వంటివి కూడా జరిగినట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఈ సంఘటన తర్వాత రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ, నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్‌తో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకుల దృష్టికి అజయ్ రాయ్ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘర్షణలో ప్రమేయం ఉన్న వారు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. వారి ఉనికి పార్టీ వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మమతా చౌదరిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Supporters of Congress leader Ajay Rai and UP Congress president Aradhana Mishra Mona clashed at the party office in Lucknow. Blows were exchanged, shoes were huled over allegations that Rai’s supporters were absued. https://t.co/KIN1LFSzrd
— Piyush Rai (@Benarasiyaa) October 11, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

