Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
నంబర్ ప్లేట్లతో జరభద్రం.. ఇష్టమొ చ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేస్తున్నారు. ఇటీవల పోలీసులు, ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టు బడిన వందలాది వాహనాల్లో నంబర్ ప్లేట్లు ఇష్టానుసారంగా బిగించి చిక్కినవే.
Number Plates |సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ) : నంబర్ ప్లేట్లతో జరభద్రం.. ఇష్టమొ చ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేస్తున్నారు. ఇటీవల పోలీసులు, ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టు బడిన వందలాది వాహనాల్లో నంబర్ ప్లేట్లు ఇష్టానుసారంగా బిగించి చిక్కినవే. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్ ప్లేట్లపై ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్న అంకె లను అమర్చుకుంటున్నారు. BOSS, IGOD, 1, 2, 3 ఇలాంటి నంబర్లతో చాలా వాహ నాలు రోడ్డెక్కుతున్నాయి. అయితే లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్యాన్సీ నంబర్లను కొంత మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా అమర్చి అధికారుల తనిఖీల్లో చిక్కారు. అయితే తమ ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు చెల్లించాం.. తమ ఇష్టమొచ్చినట్టుగా నంబర్ రాసుకుంటాం అంటూ కొందరు అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు. అయితే నిబంధనలు పాటించకుంటే కుదరదని అధికారులు హెచ్చరించారు. అందులో భాగంగానే నంబర్ ప్లేట్ వాహనాలపై అధికా రులు డ్రైవ్ చేపట్టారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ ఆటోమెటి క్ గా నిబంధనలకు అనుగుణంగా హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ వస్తుంది. దానిని అమర్చుకోవాల్సిందేనని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు.
వంకర టింకర వద్దు..!
కొంతమంది వాహనదారులు నంబర్ ప్లేట్‌ను ప్రైవేటుగా బిగించుకుంటున్నారు. వారికి నచ్చిన విధంగా రాసుకుంటున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ అది నంబర్ కనిపించదు. తమ హోదాలు, పేర్లు, లక్కీ నెంబర్లు, సింబల్స్ ఇలా ఇష్టానుసారం రాసుకుంటున్నారు. నగరంలో ఇటీవల 0009 వచ్చిన ఓ కారు యజమాణి నంబర్ ప్లేట్‌పై 9 అంకెను మాత్రమే అమ ర్చాడు. దీంతో అధికారులు అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఇంకొం దరూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఏదో ఒక అర్థం వచ్చేలా నంబర్లను వంకర టింకరగా మారుస్తు న్నారు. ఈ క్రమంలో అధికారులు అట్లాంటి వాహనాలపై చర్యలకు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరికి హెచ్ఎస్ఆర్పీ(హై సెక్యూరిటీ ప్లేట్)పై అవగాహన కలిగించనున్నారు. ఎంవీ యాక్ట్ 1989 ప్రకారం ఎంవీ యాక్ట్ 50, 51 నిబంధ నల ప్రకారం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తే వెహికిల్ వివరాలతో పాటు ఓనర్ డిటేయిల్స్ మొత్తం తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. వాహనాలు దొంగతనం జరి గినా.. ప్రమాదానికి గురైన వివరాలు తెలుసుకో వచ్చు. అయితే చాలా వరకు నగరంలో నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ తో రాకపోకలు సాగుతున్నా యని, అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా లైసెన్స్ రద్దు పరిశీలన కూడా చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదిగో నంబర్ ప్లేట్ల నిబంధనలు!
• 7 రకాల నంబర్ ప్లేట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో కేటగిరీ సేవలకు ఒక్కో నంబర్ ప్లేట్‌ను వినియోగిస్తారు. సేవల ఆధారంగా వాటికి కలర్స్ కేటాయిస్తారు.
• వైట్ట్పై బ్లాక్ కలర్లో నంబర్ ఉంటే అది నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్‌ను సూచి స్తాయి. సొంత వాహనాలకు ఈ తరహా నంబర్ ప్లేట్‌ను కేటాయిస్తారు. కొంత మంది వైట్ ప్లేట్ వాహనాలను యెల్లో బోర్డు వాహనాల వలే కిరాయిలు కొడుతుంటారు.
• యెల్లో ప్లేట్‌పై బ్లాక్ నంబర్ ఉంటే అవి ట్రాన్స్పోర్ట్ వాహనాలని సంకేతం. కమ ర్షియల్ అవసరాలకు ఈ తరహా బండ్లను ఉపయోగించుకోవచ్చు. గూడ్స్ సర్వీస్‌కు అనుమతి ఉన్న వాహనాలని అర్థం.
• బ్లాక్ ప్లేట్‌పై యెల్లో కలర్ నంబర్ ఉంటే ఆ వాహనాలు అద్దె సర్వీస్‌కు అనుమతిం చబడినట్టు. అంటే ఆ వాహనాలను ఓనర్ రెంటెడ్ బేస్ మీద అద్దెకు ఇవ్వొచ్చు. చాలా మంది రెంటల్స్ సర్వీస్ అంది స్తారు. అయితే ఈ తరహా వాహనాలు కాకుండా ఇతర వాహనాలను అద్దెకు ఇస్తే ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తారు.
• గ్రీన్ బోర్డుపై వైట్ కలర్ నంబర్ ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలని సంకేతం.
• బ్లూ ప్లేట్‌పై వైట్ కలర్లో నంబర్ ఉంటే ఆ వాహనాలు కాన్సులేట్ కార్యాలయ వాహనాలని సంకేతం.
• యెల్లో ప్లేట్‌పై రెడ్ కలర్ నంబర్ ఉంటే ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వాహనా ని అర్థం. అంటే కొత్త వాహనాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసే ఎక్స్పో లకు ఆ వాహనాలను తరలించేందుకు ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వాహనా లను ఉపయోగిస్తారు. గ్రీన్ ప్లేట్‌పై యెల్లో నంబర్ ఉంటే అవి ఎలక్ట్రిక్ వాహనాలు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

