అవాడా అత్యాధునిక సోలార్ మాడ్యూల్
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రముఖ సౌర విద్యుత్తు సంస్థ ‘అవాడా’ మార్కెట్లోకి సరికొత్త జీ12 ఎన్ టాప్ కాన్ 720 డబ్లూపీ డీసీఆర్ సోలార్ మాడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిషరించింది.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రముఖ సౌర విద్యుత్తు సంస్థ ‘అవాడా’ మార్కెట్లోకి సరికొత్త జీ12 ఎన్ టాప్ కాన్ 720 డబ్లూపీ డీసీఆర్ సోలార్ మాడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిషరించింది. శనివారం హైదరాబాద్‌లో ఎస్ఏఎస్ ఎనర్జీ , శ్రీ అసోసియేట్స్ , మోక్ష సోలార్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇంధన శాఖ రిటైర్డ్ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అత్యాధునిక మాడ్యూల్‌ను మారెట్లోకి విడుదల చేశారు.
ఈ సదస్సులో టీజీఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ సీహెచ్ చక్రపాణి, టీజీరెడ్కో జనరల్ మేనేజర్ సత్య వరప్రసాద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పంకజ్ ఉపాధ్యాయ్, అతుల్ మెష్రామ్, వేణుగోపాల్ మైలు నూతన టాప్ కాన్ సాంకేతికత విశిష్టతలను, దాని అధిక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వివరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సౌర విద్యుత్తు విభాగంలో ఇటువంటి నూతన ఆవిషరణలు విద్యుత్తు ఉత్పాదకతను భారీగా పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయని స్పష్టం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

