డిస్కంలో డైరెక్టర్ల వార్!
దక్షిణ డిస్కంలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. గతంలో అధికారుల మధ్య గ్రూపు వార్ కొనసాగుతుండగా తాజాగా డైరెక్టర్లు గ్రూపులు కట్టారు. ఉన్నది నలుగురే డైరెక్టర్లు అయినా ఎవరికివారే అన్న తీరులో డిస్కం అభివృద్ధి విషయంలో ఒకరినొకరు నిందించుకుంటున్నారు. సాక్షాత్తు సీఎండీ జితేశ్ వీ పాటిల్ సమక్షంలో డైరెక్టర్ల మధ్యలో గొడవ జరగడం, ఒక దశలో ఆ ఇద్దరు డైరెక్టర్లు సీఎండీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల డిస్కంకు నష్టం జరుగుతుందంటూ విభేదించడంతో గొడవ ముదిరింది.
-
డిస్కంను శాసిస్తున్న ఆ డైరెక్టర్‌పై ఇద్దరు డైరెక్టర్ల ఫిర్యాదులు
-
ప్రజాప్రయోజనాలనుతాకట్టు పెడితే.. సహించబోమంటూ హెచ్చరిక
-
తన ప్రమేయం లేకుండాఅక్రమ బదిలీలు చేయడంపై ఆ విభాగం డైరెక్టర్ అలక
-
లక్షల రూపాయలు చేతులు మారడం వెనక అదే విభాగం చీఫ్‌ది కీలక పాత్ర
దక్షిణ డిస్కంలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. గతంలో అధికారుల మధ్య గ్రూపు వార్ కొనసాగుతుండగా తాజాగా డైరెక్టర్లు గ్రూపులు కట్టారు. ఉన్నది నలుగురే డైరెక్టర్లు అయినా ఎవరికివారే అన్న తీరులో డిస్కం అభివృద్ధి విషయంలో ఒకరినొకరు నిందించుకుంటున్నారు. సాక్షాత్తు సీఎండీ జితేశ్ వీ పాటిల్ సమక్షంలో డైరెక్టర్ల మధ్యలో గొడవ జరగడం, ఒక దశలో ఆ ఇద్దరు డైరెక్టర్లు సీఎండీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల డిస్కంకు నష్టం జరుగుతుందంటూ విభేదించడంతో గొడవ ముదిరింది. ముఖ్యంగా ప్రస్తుతం సీఎండీకి అత్యంత దగ్గరగా మొత్తం డిస్కంనే తన చెప్పుచేతల్లో నడుపుతున్న ఓ డైరెక్టర్ నిన్న మొన్నటివరకు తానొక్కడే అన్నట్లుగా వ్యవహరించారు. కానీ తాజా పరిణామాలతో తనతో పాటు మరొక డైరెక్టర్‌ను కలుపుకుని తన నిర్ణయాలకు వత్తాసు పలికేలా చూసుకుంటున్నారంటూ డిస్కంలో చర్చ జరుగుతోంది.
కొనసాగుతున్నదని, ఈ విషయంలో ఎవరికి ఏం కేటాయించారనేది తెలియకుండా ఎవరెవరి ఆర్డర్లు ఎప్పుడు వచ్చాయో బయటకు రాకుండా వాళ్లు తమ కొత్త డ్యూటీల్లో జాయిన్ తర్వాత మాత్రమే మిగతావారికి తెలిసేలా పకడ్బందీగా వ్యవహారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు చేతులు మారాయని, ఇద్దరు అధికారులు తాము ఆపరేషన్స్‌లో పనిచేస్తుండగానే వారికి ఎమ్మార్టీ వంటి చోట్ల ప్రమోషన్‌కు అవకాశం కల్పించాల్సి ఉండగా అలా కాకుండా ఒక్కొక్కరి దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని అదే ఆపరేషన్స్ విభాగానికి పంపించారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి బాధ్యుడుగా చీఫ్ అధికారి ఉండగా వెనకుండి నడిపించింది మాత్రం ప్రస్తుతం డిస్కంను నడిపిస్తున్న ఆ డైరెక్టరేనని ఉద్యోగులు చెప్పుకొంటున్నారు.
బదిలీల పంచాయితీ కొనసాగుతుండగానే తమ ప్రమేయం లేకుండానే తమ విభాగాల్లో తలదూర్చడం, ప్రజాప్రయోజనాలను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గతవారం డిస్కంలో సీఎండీ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు డైరెక్టర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు తెలిసింది. ఈ గొడవ విషయం కార్పొరేట్ ఆఫీసుతో పాటు సర్కిల్ ఆఫీసులలో చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఈ డైరెక్టర్ల మధ్య గొడవేంటా అని ఆరా తీస్తున్నారు. ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఇప్పటివరకు డిస్కంలో ఏ నిర్ణయం జరగాలన్నా, ఎటువంటి వస్తు సామగ్రి కొనుగోళ్లు అయినా, ఉద్యోగుల బాధ్యతలకు సంబంధించిన వ్యవహారాలైనా అన్నీ ఆ డైరెక్టరే స్వయంగా కీలక అధికారికి చెప్పి చేయిస్తుండడంతో ఇన్నాళ్లూ అతనికి ఇటీవల బదిలీ అయిన ఇంధన శాఖ కార్యదర్శి మద్దతు ఉన్నదని భావించి.. మిగతా డైరెక్టర్లు మాట్లాడకుండా ఉన్నారని, ఇప్పుడు ఆయన బదిలీ కావడంతో కొత్త కార్యదర్శి అయినా ఈ కీలక డైరెక్టర్ వ్యవహారాలపై దృష్టి సారిస్తారా లేదా అంటూ మాట్లాడుకుంటున్నారు.
సీఎం సలహాదారు పీఏతో లావాదేవీలట!
డిస్కంను శాసిస్తున్న డైరెక్టర్‌కు సీఎం సన్నిహితుడు, సలహాదారుడుగా ఉన్న వరంగల్ జిల్లా నేతకు పీఏగా వ్యవహరిస్తున్న రవిలా ప్రకాశించే వ్యక్తి అండదండలు ఉన్నాయని తెలుస్తోంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో పాటు ఒకే ప్రాంతం కూడా కావడంతో ఆ డైరెక్టర్ చేసే ప్రతీ పనిని ఆ పీఏ స్వాగతిస్తాడని, ఎవరైనా ఆయనపై ఫిర్యాదు చేస్తే అంతా ఆయనే చూసుకుంటాడనే చర్చ జరుగుతోంది. ఇందుకోసం డిస్కంలో చేసే ప్రతీ లావాదేవీలో ఆయన వాటా తప్పనిసరిగా తీసి అవన్నీ నెలవారీ మామూళ్లుగా మూటకట్టి అప్పగిస్తున్నట్లు తెలిసింది.
దసరా, దీపావళి కానుకలుగా పెద్ద ఎత్తున ముట్టజెప్పారని, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసినవే కాకుండా కొత్త కాంట్రాక్టులు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర వసూలు చేసినవి అన్నీ కలిపి కోట్ల రూపాయల ముడుపులు అక్కడికి అందించి తన ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారంటూ సదరు సలహాదారు క్యాంపు ఆఫీసుకు వెళ్లొచ్చిన ఒకరిద్దరు అధికారులు తమ సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. అయితే పీఏ అన్న ఫోన్ ఎత్తకుండా.. కేవలం డిస్కంకు సంబంధించి ఏవైనా లావాదేవీలు మాట్లాడాలంటేనే ఆ డైరెక్టర్ ఫోనే ఎత్తుతాడని, కీలక అధికారి మంచివాడే అయినా ఆయనను పూర్తిగా డైవర్ట్ చేస్తూ ముడుపులు మూటగట్టడంలో ఈ డైరెక్టరు బిజీగా ఉండి తన వెన్నుదన్నుగా నిలుస్తున్న రవిలా ప్రకాశిస్తున్న ఆ పీఏను చూసుకుంటున్నారంటూ డిస్కంలోని 21సర్కిళ్లలో చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో అందుకే ఈ డైరెక్టరు విషయంలో తమ గాడ్ఫాదర్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లినా ఎవరూ అడిగే పరిస్థితి లేదని, కేవలం పీఏను మచ్చిక చేసుకోవడంతోనే మొత్తం డిస్కంలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయంటూ కొందరు కీలక అధికారులు ఆఫ్‌ది రికార్డు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

