మేం బీఆర్ఎస్తోనే ఉంటాం
మా కొడుకు లక్ష్మణ్‌గౌడ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్లోనే ఉన్నడు. ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతం’ అని లక్ష్మణ్‌గౌడ్ తల్లిదండ్రులు స్పష్టంచేశారు. చెట్టంత కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు
-
ఎక్స్‌కవేటర్‌పై మైనింగ్ కేసు
-
భూమిని గుంజుకునే ప్రయత్నం
-
ఒత్తిడితో లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య
-
ఆయన కుటుంబ సభ్యుల వెల్లడి
-
బాధిత కుటుంబానికి ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శ
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ)/బచ్చన్నపేట: ‘మా కొడుకు లక్ష్మణ్‌గౌడ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్లోనే ఉన్నడు. ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతం’ అని లక్ష్మణ్‌గౌడ్ తల్లిదండ్రులు స్పష్టంచేశారు. చెట్టంత కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్ జనగామ జిల్లా చేర్యాల నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి వెళ్లి వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.
అంతకుముందు లక్ష్మణ్‌గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌గౌడ్ తల్లిదండ్రులు, ఆయన సతీమణి కన్నీటిపర్యంతమయ్యారు. సోదరుడు వెంకట్ మాట్లాడుతూ లక్ష్మణ్‌కు కేసీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అంటే ఎంతో అభిమానమని అన్నారు. 24 ఏండ్లుగా పార్టీ వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్.. లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మణ్‌గౌడ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, మొరం తరలించాడనే కారణంతో ఎక్స్‌కవేటర్‌పై మై నింగ్ కేసు నమోదు చేసి సీజ్ చేశారని, భూ మిని గుంజుకునేందుకు యత్నించారని ఆయ న కుటుంబ సభ్యులు చెప్పారు. కాంగ్రెస్ నేత లు ఆర్థిక సాయం చేసిన మాట వాస్తవేమనని, కానీ బీఆర్ఎస్ వెంట నడుస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

