Lal Darwaja Bonalu | హైదరాబాద్‌లో బోనాల పండుగ సందడి అంబరాన్నంటింది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా నగరంలోని మహంకాళి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇక బోనాల పండుగా సందర్భంగా కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ తల్లిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకోగా.. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని బండారు దత్తాత్రేయ దర్శించుకున్నాడు. ఆలయాల పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. విద్యుత్ అలంకరణలు, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య శిబిరాలు వంటి ఏర్పాట్లు భక్తులకు అందుబాటులో ఉంచారు. మొత్తంమీద, బోనాల పండుగ మహోత్సవం హైదరాబాద్‌లో భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతోంది.