హైదరాబాద్, డిసెంబర్ 13: హైదరాబాద్ సమీపంలో నెలకొన్న ప్రైవేట్ యూనివర్సిటీ వోగ్జెన్లో కొత్త సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ప్రసిద్ధిచెందిన బ్లూంబర్గ్ ఫైనాన్స్ ల్యాబ్‌ను 20 టర్మినల్స్‌తో నెలకొల్పామని వోగ్జెన్ వర్సిటి ఓ ప్రకటనలో తెలిపింది. తమ క్యాంపస్‌లో ఏర్పాటైన ల్యాబ్ ఇండియాలోకెల్లా పెద్దదని, విస్త్రతమైన లైబ్రరీని, సెల్ఫ్ లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసామని, అత్యాధునిక బ్లాక్‌ను, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఎరెనాను నిర్మించినట్లు వోగ్జెన్ వర్సిటీ సీఈవో విశాల్ ఖుర్మా తెలిపారు.