బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత | హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లాలోని జుబ్బల్-కోట్ఖైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్‌విప్ నరేంద్ర బ్రాగ్తా కన్నుమూశారు.

షిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లాలోని జుబ్బల్-కోట్ఖైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్‌విప్ నరేంద్ర బ్రాగ్తా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు చేతన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. గత 15 రోజుల కిందట ఛాతిలో నొప్పి రావడంతో చండీగఢ్ పీజీఐ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. నరేంద్ర బ్రాగ్తా ఏప్రిల్ నెలలో కరోనా బారినపడి కోలుకున్నారు. నరేంద్ర 1952, సెప్టెంబర్ 15న జుబ్బల్-కోట్‌ఖైలో జన్మించగా.. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
1978-82 వరకు జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా, 1993 – 98 వరకు జిల్లా బీజేపీ కార్యదర్శిగా పని చేయగా.. మొదటిసారి 1998 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2007లో జుబ్బల్-కోట్‌ఖాయ్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ధుమాల్ ప్రభుత్వంలో హార్టికల్చర్, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం ఆయన మళ్లీ మూడోసారి 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికవగా.. అసెంబ్లీలో చీఫ్ విప్ బాధ్యతను అప్పగించారు. ఆయన మృతిపై జీఎం జై రామ్ ఠాకూర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

