హైదరాబాద్, జూలై 25 : ప్రముఖ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థ బైండ్జ్.. భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తమ రెండో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, కైంప్లెయెన్స సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొన్ని ఇక్కడ మరో సెంటర్‌ను నెలకొల్పినట్టు కంపెనీ ఎండీ, సీఈవో శిరీష్ కొరడా తెలిపారు.
జాతీయ వృద్ధితోపాటు ప్రపంచస్థాయిలో కొనసాగుతున్న ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తున్నదన్నారు. నగరంలో అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన సిబ్బంది ఉండటంతోపాటు బలమైన మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక కనెక్టివిటీతో మా భవిష్యత్తు వృద్ధికి తోడ్పడే కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు.