e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News జిహ్వకు.. ‘బిళ్ల’ బంట్రోతు! రుచి అదిరిపోవాల్సిందే!

జిహ్వకు.. ‘బిళ్ల’ బంట్రోతు! రుచి అదిరిపోవాల్సిందే!

జిహ్వకు.. ‘బిళ్ల’ బంట్రోతు! రుచి అదిరిపోవాల్సిందే!

తెలంగాణ ప్రాంతంలో రుచులను ఆస్వాదించే పద్ధతి వేరుగా ఉంటుంది. పప్పు, పచ్చడి, కూరా ఇన్ని రకాలున్నాచారో, పచ్చిపులుసో లేకపోతే వెలితిగా భావిస్తారు. వేపుళ్ల కన్నా వేడివేడిగా రసం ఉంటే చాలంటారు. పొడిపొడి కూరలకన్నా కలివిడిగా కలుపుకొని హడావుడిగా లాగించే పులుసులకే మొగ్గు చూపుతారు. అందుకే బెండకాయతో చల్లపులుసు, ఆన్యపకాయతో చింతకాయ పప్పుచారు, బుడమకా యతో పప్పుకట్టు ఇలా పాకపర్వంలో ఇష్ట‘రసాలు’ ఒలికి స్తారు. కూరగాయలేం లేకపోయినా శనగపిండి బిళ్లలతో కమ్మటి పులుసు పెడతారు. చికెన్‌ పులుసులోని చిక్కదనంతో, మటన్‌ పులుసులోని ఘాటుదనంతో,  కొంచెం కారంగా, కొంచెం కమ్మగా ఉండే  బిళ్లల పులుసు తెలంగాణవాసులకు ఎంతో ఇష్టం.

  • బిళ్లల పులుసును తెలంగాణలో ఒక్కోచోట ఒక్కోపేరుతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో బిళ్ల వక్కలు అంటే, మరికొన్ని ప్రాంతాల్లో పాటల కూర అనీ, వక్కల పులుసు అనీ పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా రుచి మాత్రం అదిరిపోవాల్సిందే!
  • శనగపప్పులో మధుమేహాన్ని తగ్గించే గుణాలున్నాయి. ఇందులో పీచుపదార్థం కూడా అధికమే. పైగా దీని ైగ్లెసమిక్‌ ఇండెక్స్‌ కూడా చాలా తక్కువ. అలాగే శనగపప్పు నెమ్మదిగా జీర్ణమవడం వల్ల గ్లూకోజ్‌ నెమ్మదిగా విడుదలవుతుంది.
  • శనగపప్పులో ప్లాంట్‌ బేస్డ్‌ ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండేవారికి సాధారణంగా ప్రొటీన్లు సరిగ్గా అందవు. కాబట్టి వారు.. ప్రొటీన్ల కోసం శనగపప్పు ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. 60 గ్రాముల శనగపప్పులో ఆరు గ్రాముల వరకు ప్రొటీన్‌ లభిస్తుంది. ఇతర పప్పు దినుసులతో పోలిస్తే దీనిలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్లు ఉంటాయి.  మనకు ఎంతో ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ ప్రొటీన్ల కారణంగా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
  • బిళ్లల పులుసు రుచి ప్రత్యేకం. పుల్లగా, తియ్యగా, కమ్మగా, ఘాటుగా ఇలా ముద్దముద్దకో రుచి జిహ్వకు అందుతుంది. చింతపండు, బెల్లం ముక్క, దాల్చిన చెక్క అన్నీ కలగలిపి చేయడంవల్లనే బిళ్లల పులుసు రకరకాల రుచుల సమ్మేళనంగా తయారవుతుంది. పులుసులోని ఫ్లేవర్లను దాచుకున్న శనగపిండి బిళ్లలను అన్నంలో మెదుపుకొని లాగిస్తూ ఆ రుచిని మనసారా ఆస్వాదిస్తూ ఉంటే.. ఆత్మారాముడు ‘ఈ జీవితం రుచి చూడడానికి దొరికేరా..’ అని పాడుతూ కేరింతలు కొట్టేస్తాడు.
  • శనగపిండిని నూనెలో ఉల్లితరుగు, జీలకర్రతోపాటు వేయించి, ముద్దలా వచ్చేలా నీళ్లు కలుపుతారు. దీంతో చేసిన బిళ్లలతో పులుసు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కమ్మదనం కోసం ఈ పులుసులో బెల్లంగానీ, చక్కెరగానీ వేస్తారు. కొన్నిచోట్ల మసాలా వేసి ఘాటుగా పులుసూ పెడతారు. మసాలా వేసి చేస్తే అచ్చంగా నాన్‌వెజ్‌ పులుసులా కనిపిస్తుంది. రుచి కూడా అలాగే అనిపిస్తుంది. 
జిహ్వకు.. ‘బిళ్ల’ బంట్రోతు! రుచి అదిరిపోవాల్సిందే!
  • నోటికి కమ్మదనాన్నే కాదు 
  • శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలోనూ బిళ్లల పులుసు స్థానం ప్రత్యేకం. శనగపిండి వాడటం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలపొడిలోని పోషకాలన్నీ శరీరానికి మేలు చేసేవే.
  • బిళ్లలు చేయడానికి ఎక్కువగా శనగపిండినే వాడినా కొన్ని ప్రాంతాల్లో బియ్యప్పిండినీ  వాడుతారు. అయితే శనగపిండి రుచి బియ్యప్పిండితో చేసిన బిళ్లలకు రాదు.
  • కొందరు బిళ్లల్ని నూనెలో వేయిస్తే, కొందరు ఆవిరిపై ఉడికిస్తారు. బిళ్లల పులుసుని అన్నంలోకే కాదు సాంబారుకి ప్రత్యామ్నాయంగా ఇడ్లీ, దోశల్లోనూ తినేయొచ్చు.
Advertisement
జిహ్వకు.. ‘బిళ్ల’ బంట్రోతు! రుచి అదిరిపోవాల్సిందే!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement