పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్లో అధికారంలోకి వస్తే వెంటనే మద్య నిషేధాన్ని రద్దు చేస్తానని జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ఆదివారం ఆయన ఎఎన్ఐ వార్త సంస్థతో మాట్లాడుతూ ‘అక్టోబర్ 2 కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యే అవసరం లేదు.
మా ప్రభుత్వం ఏర్పడితే గంటలో మద్య నిషేధాన్ని రద్దు చేస్తాం’ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్య నిషేధం అత్యంత నకిలీదని తెలిపారు.