Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం సీక్రెట్ టాస్క్‌ల సంఖ్య పెరగడంతో హౌస్‌లో అల్లకల్లోలం నెలకొంది. హౌస్‌లో ఎవరు రెబల్స్ అనే విషయం గుర్తించలేక మిగతా కంటెస్టెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ వారం దివ్య, సుమన్ శెట్టి రెబల్స్‌గా వ్యవహరిస్తుండగా, వీరి టాస్క్‌లు హౌస్ వాతావరణాన్ని కాస్త హీటెక్కించాయి. మంగళవారం ఎపిసోడ్లో దివ్య, సుమన్ ఇద్దరూ కిచెన్‌లో ఉన్న పాల ప్యాకెట్స్‌ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. బుధవారం ఉదయం రేషన్ మేనేజర్ రీతూ పాలు మిస్సింగ్ అయినట్టు గుర్తించడంతో హౌస్‌లో కాసేపు గందరగోళం నెలకొంది.
కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న గౌరవ్ సమయానికి ఆమ్లెట్ ఇవ్వలేదని కెప్టెన్ దివ్య, రీతూ ఫైర్ అయ్యారు. గౌరవ్ మాత్రం “స్నానం చేసి రావడం వల్ల కేవలం ఐదు నిమిషాలు లేట్ అయ్యాను” అని చెప్పాడు. కానీ దివ్య, రీతూ అతని వివరణను పట్టించుకోకుండా “ఇకపై కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండకు” అని నిర్ణయించారు. దీనిపై గౌరవ్ ..రీతూ, దివ్యలకి కౌంటర్ ఇస్తూ “పాలు పోయినా కూడా నన్ను అంటారు ఎందుకు? నేను 24 గంటలు కిచెన్‌లో ఉండలేను. నేను నీ సర్వెంట్ కాదు” అంటూ విరుచుకుపడ్డాడు. హౌస్‌లో ఈ వాగ్వాదం చర్చనీయాంశమైంది.
పాలు దాచిన దివ్య మహానటిలా నటించి ఏమీ తెలియనట్టు వ్యవహరించింది. ఆమె టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో బిగ్ బాస్ ఫోన్లో సీక్రెట్‌గా అభినందించారు. హౌస్ సభ్యులు మాత్రం డిమాన్ లేదా సంజన రెబల్స్ అయి ఉండొచ్చని గెస్ చేస్తూ పొరబడ్డారు.తరువాత బిగ్ బాస్ ఇచ్చిన కొత్త టాస్క్‌లో పింక్, ఆరెంజ్, బ్లూ టీంలు పోటీ పడ్డాయి. చీకటిగా ఉన్న యాక్టివిటీ ఏరియాలో వస్తువులను టచ్ చేసి, స్మెల్ చేసి వాటి పేర్లు చెప్పాలి. భయపెట్టడానికి అక్కడ గోస్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంచారు. చివరికి ఆరెంజ్ టీం విజేతగా నిలిచింది. మొత్తానికి బుధవారం ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులని రంజింపజేసింది అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ ఈ వారం సీక్రెట్ టాస్క్‌లతో హీట్ అవుతోంది. రెబల్స్ ఎవరో తెలుసుకునే క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య మరిన్ని ఘర్షణలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.