‘మనం చిన్నప్పటి నుంచి ఎన్నో జానపద కథలు విని ఉంటాం. ‘వెనకటి రోజుల్లో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఓ పిశాచిని కాపలాగా పెడతారు’ అంటూ ఓ కథ ప్రచారంలో ఉండేది. ఈ సినిమాకు అలాంటి జానపద కథే ఆధారం’ అన్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన నటించిన సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు. బుధవారం చిత్ర హీరో సుధీర్‌బాబు పాత్రికేయులతో ముచ్చటిస్తూ సినిమా సంగతుల్ని పంచుకున్నారు.