Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో శనివారం వీకెండ్ ఎపిసోడ్ హాట్‌హాట్‌గా సాగింది. హోస్ట్ నాగార్జున డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత హౌస్‌లో జరిగిన గొడవలు, కంటెస్టెంట్స్ వ్యవహారశైలిపై ఒక్కొక్కరినీ ప్రశ్నించారు. ముఖ్యంగా షాలిని, రోహిత్, అమన్‌లకు సంబంధించిన వీడియోలను అందరి ముందు ప్రదర్శించి గట్టిగా క్లాస్ తీసుకున్నారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో శనివారం వీకెండ్ ఎపిసోడ్ హాట్‌హాట్‌గా సాగింది. హోస్ట్ నాగార్జున డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత హౌస్‌లో జరిగిన గొడవలు, కంటెస్టెంట్స్ వ్యవహారశైలిపై ఒక్కొక్కరినీ ప్రశ్నించారు. ముఖ్యంగా షాలిని, రోహిత్, అమన్‌లకు సంబంధించిన వీడియోలను అందరి ముందు ప్రదర్శించి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. గత వారం హెచ్చరించినా షాలిని తన తీరు మార్చుకోకపోవడంపై నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు నామినేషన్ల గురించి చర్చించినందుకు షాలిని, రోహిత్, అమన్‌లకు శిక్ష విధించారు.
ఎపిసోడ్ ప్రారంభంలో శుక్రవారం హౌస్‌లో జరిగిన కొన్ని సంఘటనలను చూపించారు. ముకేశ్ తనను పట్టించుకోవడం లేదని ఝాన్సీ బాధపడుతూ ఏడ్చింది. ఈ విషయంపై ముకేశ్, వర్షిణి మాట్లాడుకున్నారు. మరోవైపు వంశీ, త్రిగున్ కూడా ఈ వ్యవహారంపై చర్చించారు. అనంతరం ముకేశ్ ఝాన్సీ దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా, వాష్‌రూమ్ దగ్గర బట్టల విషయంలో త్రిగున్, రోహిత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. రోహిత్ తన బట్టలను అక్కడే వదిలేయడంతో త్రిగున్ వాటిని తీసి కింద పెట్టాడు. దీంతో రోహిత్ ఆగ్రహానికి గురై త్రిగున్‌ను దుర్భాషలాడటంతో పాటు కొడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది.
కొత్త కెప్టెన్ రామ్ ప్రసాద్‌కు కెప్టెన్సీకి సంబంధించిన గోల్డ్ కాయిన్స్ అందించారు. తనకు వచ్చిన కాయిన్స్‌ను నరేష్, దేబ్జానీలకు ఇచ్చాడు. మరోవైపు షాలిని, రోహిత్ మధ్య ప్రేమాయణం కొనసాగింది. రాత్రి సమయంలో కూడా ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటుండటంతో బిగ్‌బాస్ హెచ్చరించారు. మూడుసార్లు చెప్పినా వారు మాట్లాడుకోవడం ఆపకపోవడం చర్చనీయాంశమైంది. హౌస్‌మేట్స్‌తో మాట్లాడటం ప్రారంభించిన నాగార్జున ముందుగా రామ్ ప్రసాద్ కెప్టెన్‌గా ఎంపికైనందుకు అభినందించారు. అనంతరం బట్టల విషయంలో జరిగిన గొడవపై ప్రశ్నించారు. హౌస్‌లో ఎవరికి పడితే వారు బట్టలు పడేసి వెళ్లిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ సమస్య ఎప్పటి నుంచో కొనసాగుతోందని పేర్కొంటూ, గత కెప్టెన్ సుధీర్‌ను కూడా ప్రశ్నించారు. హౌస్‌ను క్రమశిక్షణతో ఉంచాల్సిన బాధ్యత కెప్టెన్‌పై ఉంటుందని రామ్ ప్రసాద్‌కు స్పష్టం చేశారు. వచ్చే వారం లోపు హౌస్‌లో ఇలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆ తర్వాత నీతూ నటరాజ్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన నాగార్జున ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట ఆడటానికి హౌస్‌లోకి వచ్చారా? లేక ఇతర కంటెస్టెంట్స్‌కు కోచింగ్ ఇవ్వడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. రోహిత్‌తో ఆమె మాట్లాడిన వీడియోను చూపించారు. రోహిత్ తల్లి హౌస్‌లోకి రాకముందు నీతూతో మాట్లాడిన విషయాలను రోహిత్‌కు చెప్పినట్లు ఈ సందర్భంగా వెల్లడైంది. బయట వ్యక్తులు చెప్పిన విషయాలను హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో పంచుకోవడం నిబంధనలకు విరుద్ధమని నాగార్జున హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే నేరుగా ఇంటి నుంచి బయటకు పంపిస్తానని స్పష్టం చేశారు. దీంతో నీతూ కన్నీళ్లు పెట్టుకుంది. కన్ఫెషన్ రూమ్‌లో జరిగిన సంభాషణను ఇతరులకు చెప్పవద్దని కూడా నాగార్జున సూచించారు.
షాలినిని కూడా కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి రోహిత్‌తో నీతూ మాట్లాడిన వీడియోను చూపించారు. అనంతరం అమన్, షాలిని, రోహిత్ కలిసి నామినేషన్ల గురించి చర్చించుకున్న వీడియోను హౌస్మేట్స్ అందరికీ చూపించారు. ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనే విషయంపై ముందుగానే సమూహంగా చర్చించుకోవడంపై నాగార్జున తీవ్రంగా స్పందించారు.గత వారం కూడా ఇదే అంశంపై షాలినికి హెచ్చరిక ఇచ్చినప్పటికీ మళ్లీ అదే తప్పు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో షాలిని, రోహిత్, అమన్‌లకు వచ్చే వారం కెప్టెన్ అయ్యే అవకాశం ఉండదని, కెప్టెన్సీ పోటీలో పాల్గొనడానికి కూడా అర్హత లేదని శిక్ష విధించారు. ఈ నిర్ణయంతో ముగ్గురూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
షాలిని త్రిగున్‌ను దుర్భాషలాడిన వీడియోను కూడా నాగార్జున ప్రదర్శించారు. దీనిపై వివరణ ఇవ్వాలని షాలినిని కోరారు. ఆటలో త్రిగున్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. అయితే తన వాదనను వినిపించే క్రమంలో రోహిత్ మధ్యలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, నాగార్జున అతడిని అడ్డుకున్నారు. ఇది నామినేషన్ల వ్యవహారం కాదని, షాలినికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.అనంతరం త్రిగున్‌కు షాలినితో క్షమాపణ చెప్పించారు. షాలినికి ఎలాంటి శిక్ష విధించాలనుకుంటున్నారని రోహిత్‌ను అడగగా, అతడు డబుల్ డ్యూటీ ఇవ్వాలని సూచించాడు. ఏ పని చేయించాలనేది కెప్టెన్ రామ్ ప్రసాద్ నిర్ణయిస్తారని నాగార్జున చెప్పారు. ఎపిసోడ్ చివర్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను లేపిన నాగార్జున, వారిలో ఆశించిన స్థాయిలో ఆటలో జోరు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. వారి గురించి ఆదివారం ఎపిసోడ్లో మాట్లాడతానని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

