నెల్సన్ దర్శకత్వంలో రాక్?
‘జైలర్' ఫ్రాంఛైజీతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో అగ్ర హీరో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారని గతకొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్తో తమ బ్యానర్లో సినిమా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తారని తెలుస్తున్నది. ఇటీవలే ఎన్టీఆర్ను కలిసిన నెల్సన్ ఆయనకు కథ చెప్పినట్లు సమాచారం. యాక్షన్ కామెడీ కథాంశమిదని, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఈ సినిమాకు ‘రాక్’ అనే పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదిలాఉండగా భుజానికి శస్త్ర చికిత్స కారణంగా మూడు నెలలు షూటింగ్కు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఇటీవలే ‘డ్రాగన్’ సెట్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లో యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫాంటసీ చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’లో నటించనున్నారాయన. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసే సినిమాపై స్పష్టత వస్తుందంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dragon Movie
- nelson
- NTR
- trivikram
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

