Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 62వ రోజు వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హోస్ట్ నాగార్జున ఈ వారం ఇంటి సభ్యుల ఆటతీరును ఒక్కొక్కరిగా సమీక్షించారు. ఆటలో తప్పులు చేసిన వారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. కొందరిని అభినందిస్తూనే, మరికొందరి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 62వ రోజు వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హోస్ట్ నాగార్జున ఈ వారం ఇంటి సభ్యుల ఆటతీరును ఒక్కొక్కరిగా సమీక్షించారు. ఆటలో తప్పులు చేసిన వారికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. కొందరిని అభినందిస్తూనే, మరికొందరి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షిణి, వంశీ మధ్య జరిగిన వివాదం, దేబ్జానీ గేమ్ ఆడిన తీరు, నరేష్ చేసిన తప్పిదంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఈ ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి. ముందుగా ఈ వారం కెప్టెన్‌గా ఎంపికైన వంశీని నాగార్జున అభినందించారు. అనంతరం వంశీ, వర్షిణి మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు. వర్షిణి ఒక మూలన కూర్చుని కులుకుతూ ఉంటుందని అర్థం వచ్చేలా వంశీ చేసిన వ్యాఖ్యలు ఇంట్లో వివాదానికి దారితీశాయి. ఈ మాటలపై వర్షిణి తీవ్రంగా స్పందించింది.
దీనిపై నాగార్జున ఇద్దరినీ ప్రశ్నించగా.. తాను ఆ పదాన్ని ఎలాంటి తప్పుడు అర్థంతో ఉపయోగించలేదని వంశీ వివరణ ఇచ్చాడు. అయితే వంశీ కావాలనే అలా అన్నాడని వర్షిణి ఆరోపించింది. ఇద్దరి వాదనలు విన్న నాగార్జున వర్షిణికి గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆమె ఉపయోగించిన ‘పి అండ్ బి’ పదాలతో పోలిస్తే వంశీ అన్న మాట అంత పెద్ద తప్పు కాదని వ్యాఖ్యానించారు. వంశీ మాటలు కొంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, గతంలో వర్షిణి మాట్లాడిన తీరును కూడా గుర్తు చేస్తూ నాగార్జున సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఫుడ్ విషయంలో వర్షిణి నిర్లక్ష్యంగా ఉంటోందని ప్రస్తావించారు. హౌస్‌లో ఆమె క్రమంగా షాలినిలా మారుతోందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత దేబ్జానీ ఆటతీరుపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. టాస్క్ ఆడుతున్న సమయంలో ముకేశ్‌తో ఆమె వ్యవహరించిన విధానం ఏమాత్రం బాగోలేదని అన్నారు. ముఖ్యంగా ముకేశ్ మగాడు కాదంటూ ఆటలోకి జెండర్ అంశాన్ని తీసుకురావడాన్ని తప్పుబట్టారు. ఆటలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా ఉండకూడదని, అందరూ సమానమేనని నాగార్జున స్పష్టం చేశారు. గేమ్‌లో గెలవాలనే ఉద్దేశంతో వ్యక్తిగత అంశాలను తీసుకురావడం సరైన పద్ధతి కాదని దేబ్జానీకి క్లాస్ తీసుకున్నారు. దీంతో దేబ్జానీ ప్రవర్తన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం నరేష్‌కు సంబంధించినది. రివేంజ్‌కు గురైన సభ్యులు ఆడిన బ్యాలెన్స్ చేసే టాస్క్‌కు నరేష్ సంచాలకుడిగా వ్యవహరించారు. అయితే టాస్క్ నిర్వహణలో ఆయన చేసిన పొరపాటు కారణంగా ముకేశ్, వర్షిణి గెలవకపోయినా విజేతలుగా ప్రకటించారు. దీంతో అమన్, ఆర్కే నష్టపోయారు.
ఈ విషయాన్ని నాగార్జున ప్రస్తావిస్తూ నరేష్ సంచాలకుడిగా తప్పు చేశారని స్పష్టం చేశారు. అయితే తన తప్పును అంగీకరించి, తాను తప్పు చేసి ఉంటే ఈ వారం తన కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని వదులుకుంటానని నరేష్ ఛాలెంజ్ చేయడాన్ని అభినందించారు. అయితే తప్పు జరిగినందున దానికి బాధ్యత వహించాల్సిందేనని నాగార్జున తెలిపారు. ఈ వారం నరేష్ తన కుటుంబ సభ్యులను కలుసుకోలేడని ప్రకటించారు. దీంతో నరేష్‌కు పెద్ద షాక్ తగిలింది. కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కోల్పోవడంతో ఆయన పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
62వ రోజు ఎపిసోడ్లో నాగార్జున తనదైన శైలిలో ఇంటి సభ్యుల ఆటతీరుపై స్పందించారు. వర్షిణికి కౌంటర్ ఇవ్వడం, దేబ్జానీకి గేమ్‌లో హద్దులు గుర్తు చేయడం, నరేష్ తప్పిదానికి శిక్ష విధించడం వంటి పరిణామాలతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ వారం కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఎవరికి దక్కుతుంది? రాబోయే రోజుల్లో ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

