భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ టీకా 3వ దశ ట్రయల్స్ పూర్తి
హైదరాబాద్: నగరానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్ టీకాలను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కోవాగ్జిన్ టీకాను రూపొందించిన ఆ సంస్థ ఇప్పుడు ఇంట్రానాసల్ టీకా బీబీవీ154 మూడవ దశ ట్రయల్స్‌ను పూర్తి చేసినట్లు తెలిపింది. బూస్టర్ డోసు రూపంలోనూ బీబీవీ154 ఇంట్రానాసల్ టీకాను ఇవ్వనున్నారు. మూడవ దశ ట్రయల్స్‌కు సంబంధించి భారత్ బయోటెక్ సంస్థ ప్రకటన చేసింది. రెండు డోసుల రూపంలో బీబీవీ154 ఇంట్రానాసల్ టీకాను ఇచ్చేందుకు కావాల్సిన అన్ని ట్రయల్స్‌ను పూర్తి చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక బూస్టర్ డోసుగానూ బీబీవీ154ను ఇవ్వవచ్చు అని భారత్ బయోటెక్ చెప్పింది. మూడవ దశ ట్రయల్స్‌కు చెందిన డేటాను జాతీయ అధికారులకు సమర్పించినట్లు తెలిపింది.
Bharat Biotech completes clinical development for phase III trials and booster doses for BBV154 intranasal covid vaccine.#BharatBiotech #covid19vaccine #bbv154 #intranasalvaccine #covid19 pic.twitter.com/oh76drnezz
— Bharat Biotech (@BharatBiotech) August 15, 2022
ప్రైమరీ డోసు షెడ్యూల్లో భాగంగా ఇంట్రానాసల్ టీకా ఎంత సురక్షితంగా ఉంది, ఎంత వరకు ఇమ్యూనిటీ ఇస్తుందన్న అధ్యయనం చేశారు. సుమారు 3100 మందిపై ఈ టెస్టింగ్ జరిగింది. దేశంలోని సుమారు 14 ప్రాంతాల్లో ట్రయల్స్‌ను నిర్వహించారు. బూస్టర్ డోసుగా సుమారు 875 మందిపై పరీక్ష నిర్వహించారు. బూస్టర్ ట్రయల్స్‌ను మొత్తం 9 నగరాల్లో నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

