కొత్త సంవత్సరం అనగానే అందరూ ఏవేవో సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. వీటినే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని పిలుస్తాం. ఆల్కహాల్, సిగరెట్ మానేయాలని కొందరు..బరువు తగ్గాలని మరికొందరు.. మంచి మంచి పుస్తకాలు చదవాలని ఇంకొందరు ఇలా రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. కానీ కొత్త సంవత్సరం కొన్ని రోజులు గడువగానే విరమించుకుంటారు. మరి మనం పెట్టుకున్న రిజల్యూషన్స్ను ఏడాదంతా కొనసాగించాలంటే ఏం చేయాలి? మానసికంగా ఎలా సిద్ధం కావాలి? అనే విషయాలను క్షుణ్నంగా వివరించారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్.