తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య సహకారంతో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ ఈ క్యాంటీన్ల నిర్వహణను ప్రోత్సహిస్తోంది. అలా ఏర్పాటైందే మాసబ్‌ట్యాంక్ లోని ఫిష్ క్యాంటీన్.