రాజ్‌కోట్: సీనియర్ మహిళల వన్డే టోర్నీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ జట్టు (Bengal Team)చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో 390 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు చేధించింది. లిస్టు-ఏ మహిళల క్రికెట్లో ఇది రికార్డు విజయం కావడం విశేషం. గతంలో న్యూజిలాండ్ స్వదేశీ క్రికెట్లో క్యాంట్బెరిపై 309 రన్స్ చేజ్ చేసి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును బెంగాల్ బద్దలు కొట్టింది.
Super Shafali 🔥
1⃣9⃣7⃣ runs
1⃣1⃣5⃣ balls
1⃣1⃣ sixes
2⃣2⃣ foursWatch 📽️ snippets of Haryana captain Shafali Verma’s blistering knock against Bengal in Quarter Final 4 of the Senior Women’s One Day Trophy 👌#SWOneday | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/p5xyktY9X8 pic.twitter.com/cLZXPIRsas
— BCCI Domestic (@BCCIdomestic) December 23, 2024
మహిళ అంతర్జాతీయ వన్డేల్లో శ్రీలంక పేరిట భారీ విక్టరీ రికార్డు ఉన్నది. దక్షిణాఫ్రికాపై 305 రన్స్ చేజ్ చేసి శ్రీలంక విక్టరీ కొట్టింది. భారతీయ డొమెస్టిక్ క్రికెట్లో గతంలో రైల్వేస్ జట్టు అత్యధికంగా 356 రన్స్ చేసింది. బెంగాల్ గెలుపులో తనూశ్రీ సర్కార్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆమె 83 బంతుల్లో 113 రన్స్ చేసింది. దాంట్లో 20 బౌండరీలు ఉన్నాయి. మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే బెంగాల్ విక్టరీ కొట్టేసింది. దీంతో ఆ జట్టు సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హర్యానా.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 389 రన్స్ చేసింది. హర్యానా ప్లేయర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 115 బంతుల్లో 197 రన్స్ కొట్టింది. ఆమె ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. సీనియర్ మహిళ క్రికెట్ టోర్నీల్లో ఈఏడాది షఫాలీకి ఇదో రెండో సెంచరీ. యూపీపై ఆమె 98 బంతుల్లో 139 రన్స్ చేసింది.