అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. సోమవారం ‘ప్రెట్టీ ప్రెట్టీ’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ గీతాన్ని సనారే రచించారు. పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు.
హృదయాన్ని స్పృశించే ప్రేమకథా చిత్రమిదని, కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని మేకర్స్ తెలిపారు. నరేష్, వాసుకి, నందగోపాల్, సోనియాచౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: ఆడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ బన్సాల్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: జె.ఎస్.ఎస్.వర్ధన్.